Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి మంత్రి కేటీఆర్‌కు లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు, బాలాపూర్ సింగిల్ విండో మాజీ చైర్మెన్ కొలన్ శంకర్ రెడ్డి అన్నారు. ఆదివారం బాలాపూర్‌లోని స్వగహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులు, రైతుబంధు పేరుతో రూ.కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి ఆరోపణలో కూరుకపోయిందన్నారు. సీఎం కేసీఆర్ నియ ంతపాలన చేస్తున్నారన్నారు. ఎంతో మంది ప్రాణత్యాగంతో సాధించిన రాష్ట్రంలో కుటుం బ పాలన సాగుతుందన్నారు. కేంద్రం రూ. కోట్లతో హైవే రోడ్లు, ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడంతో ప్రజలు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కిసాన్ మోర్చా నాయకు లు భీమిడి చల్మారెడ్డి, రామిడి మహేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, విబిలక్ష్మణ్ రాజ్, శ్రీకాంత్, సుధాకర్, ధనలక్ష్మి పాల్గొన్నారు.