Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ గ్రామ దేవత గట్టు మైసమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఆలయ చైర్మెన్ చిత్తారి యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఏడాదీ శ్రీ గట్టు మైసమ్మ జాతర గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు, ఘట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, ఉప అధ్యక్షులు, సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, వివిధ హౌదాల్లోని వారు పాల్గొన్నారు.