Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
ఇందిరా గాంధీ నేతృత్వంలో పేదల సంక్షేమం కోసం సాగిన గరీబీ హఠావో స్ఫూర్తితో కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొ రేటర్ బొమ్మకు కల్యాణ్ కుమార్ అన్నారు. ఆదివారం డివిజన్లో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా దేవేందర్ నగర్, అంబేద్కర్ నగర్ కాలనీవాసులు ఇంటి ంటికీ తిరిగి సభ్యత్వం నమోదు చేయించారు. ఈ సందర్భంగా కల్యాణ్ కుమార్ మాటా ్లడుతూ ఇందిరా గాంధీ పిలుపు మేరకు పేదల సంక్షేమం కోసం పాటు పడుతూ అందరి అభివృద్ధి కోసం పనిచేసే కాంగ్రెస్లో చేరి సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు. సభ్యత్వం నమోదు చేసుకున్న వారందరికీ రూ.2లక్షల ఇన్సూరెన్స్ వస్తుందనీ, పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పొన్నం తరుణ్ గౌడ్, అంబాల అరవింద్ గౌడ్, డివిజన్ వాసులు పాల్గొన్నారు.