Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
స్థానికంగా పనిచేసే జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతుగా కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం ఘటకేసర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో రూపొందించిన 2022 డైరీని మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. జర్నలిస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందనీ, అందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేస్తుందన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పని చేస్తున్న జర్నలిస్టులకు త్వర లోనే ఇండ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీని చ్చారు. మల్లారెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎల్లప్పుడూ జర్నలిస్టులకు అందుబాటులో ఉంటుంద న్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంకూరి మురళి, కోశాధికారి చిర్ర శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రేగు శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి నునుబోతు రాము యాదవ్, తదితరులు పాల్గొన్నారు.