Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో అనుమానాల్లేకుండా అర్హులందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్ డాక్టర్ సురేందర్ అన్నారు. చార్మినార్ నియోజకవర్గం పరిధిలోని బాల్ శెట్టి ఖేత్ ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉచితంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు మీర్ ఫిరాసత్ అలీ బా క్రీ మాట్లాడుతూ ఇంటింటికీ వ్యాక్సిన్ ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మెడికల్ సెల్ సలహాదారులు డాక్టర్ రాజశేఖర్, బీజేపీ గోల్కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఉమామహేంద్ర, దారుషిషా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు చెందిన డాక్టర్ షాహిల్ పాల్గొన్నారు.