Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల డీఆర్డీఎల్ కాలనీ అధ్యక్షుడు రామ్ ప్రసాద్, జనరల్ సెక్రెటరీ, కరు ణాకర్ రెడ్డితో కలిసి కాలనీ సంక్షేమ సంఘం నాయకులు కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానిక కార్పొరేటర్ బి.సుజాత నాయక్‌కు వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక వసతులతోపాటు రక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలని కోరారు. స్పందించిన కార్పొరేటర్ స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సహకారంతో మంజూరు చేయించే ప్రయత్నం చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, జి.చంద్రశేఖర్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు యాదవ రెడ్డి, రమేష్ గౌడ్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.