Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు ఈనెల 31వ తేదీన నిర్వహించనున్న రైతు విద్రోహ దినం కార్యక్ర మాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలపై ఏడాది కాలం పోరాడితే ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్రోహ పాత్ర పోషిస్తుందన్నారు. పోరాట కాలంలో మరణించిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భీమనపల్లి కనకయ్య, దోనూర్ కృష్ణారెడ్డి, భాస్కర్, సీహెచ్ మల్లేశం, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.