Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
క్రీడలతో మానసికోల్లాసంతోపాటు మనోధైర్యం కలుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అదివారం జల్ పల్లి మున్సిపల్లో జరిగిన క్రికెట్ పోటీల ముగింపు, బహుమతుల ప్రదానోత్సవ కార్యక్ర మంలో మంత్రి పాల్గొని విజేతలకు బహుమతులను అంద జేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. క్రీడల్లో రాణించిన యువతీ, యువకులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను ప్రొత్సహిస్తున్నా మనీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడీల్లో రాణించాలని కోరారు. ఈ క్రికెట్ పోటీల్లో జల్పల్లి టైగర్స్ టీంపై జల్పల్లి కింగ్స్ టీం విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు ఎంజాల జనార్దన్, దూడల శ్రీనివాస్ గౌడ్, మైనార్టీ రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఖైసర్ భాం, మున్సిపల్ అధ్యక్షులు ఎక్బాల్ ఖలిఫా, రిప్రజెంటెటివ్ వైఎస్ చైర్మెన్ యూసూప్ పటేల్, కౌన్సిలర్లు శంశోద్దిన్, కె.లక్ష్మినారాయణ, పమిదా అప్జల్, మాజీ అర్మిమెన్ వాసుబాబు, క్రీడాకారులు వినరు రెడ్డిటిం, సత్యనారాయణ ఇద్రిస్ పాల్గొన్నారు.