Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ విధిగా ఇంటికో ఇంకుడు గుంత చెట్లను పెంచాలని తుర్కయంజాల్ మున్సిపాలిటీ 7వార్డు కౌన్సిలర్ రొక్కం అనితా చంద్రశేఖర్ రెడ్డి కాలనీ వాసులకు సూచించారు. ఆదివారం గణేష్ నగర్ పేజ్ 2 లో రూ.6 లక్షల మున్సిపల్ నిధులతో భూగర్భ డ్రయినేజీ పనులను ప్రారంభించి మాట్లాడారు. ఇంకుడు గుంత ఏర్పాటుతో భూగర్భ జలాలను పెంచడంతోపాటు డ్రయినేజీ సిస్టంను మెరుగు పరుచుకోవచ్చు అన్నారు. వర్షానికి ఇండ్లపై పడే నీళ్లను డ్రయినేజీలో కలపడం ద్యారా నీళ్లు ఎక్కువగా వచ్చి ఎక్కడి అక్కడ డ్రయినేజీ పొంగి పోర్లే అవకాశం ఉందనీ, ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో ఉంచుకుని వర్షపు నీటి కోసం విధిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న కాలనీలో పచ్చదనం వెళ్లి విరియాలంటే ప్రతి ఒక్కరూ ఒక చెట్టును పెట్టి తమ పిల్లలాగా సాదుకోవాలని సూచించారు. ఎవరికైనా చెట్లు కావాలంటే మున్సిపాలిటీ నర్సరీ నుంచి తీసుకోవాలని సూచించారు. నిధుల కొరత కారణంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మెయిన్ డ్రయినేజీ లైౖన్ను వేయించినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతో మున్సిపాలిటీలో 7వార్డును ఆదర్శంగా తీర్చి దిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు రమణ రెడ్డి, రాంరెడ్డి, కో-ఆర్డినేటర్ శరత్ యాదవ్, సలహాదారులు డీకే రాజు, తగరం సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, రాజారావు, సురేందర్ రెడ్డి, లక్కీ రామ్ నాయక్, దశరథ శివకుమార్, కొండల్, రవి, వీర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.