Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్ నగర్
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్ కాలనీ, శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ లక్ష్మీ డయాగస్టిక్స్ వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య అండ్ కంటి పరీక్షల శిబిరాన్ని కాలనీ వాసులతో కలిసి ఆదివారం కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మారెడ్డి పరిశీలిం చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు పాటిస్తూ ఇలాంటి ఉచిత వైద్య పరీక్షల శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల న్నారు. చుట్టుపక్కల కాలనీ ప్రజలకు సేవలను అందుస్తున్న డయాగస్టిక్స్ సెంటర్ వారిని సహకారం అందించిన కాలనీ సంక్షేమ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల ఉపెందర్ రెడ్డి, సాయినాథ్, అనంతరెడ్డి, మోహన్ రెడ్డి, పవన్, మీనేష్, రాఘవయ్య టెక్నిషియన్స్ శివ, నవీన్, సునీల్, ఇక్బాల్, బీజేపీ నాయకులు నాంపల్లి శంకరయ్య, పాతూరి శ్రీధర్ గౌడ్, సిద్దు, తదితరులు పాల్గొన్నారు.