Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్ పేట
అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి స్వరూప హెచ్చరించారు. సోమవారం మేడ్చల్ జిల్లా తూంకుంట పురపాలక సంఘ పరిధిలోని 14వ వార్డు మందాయిపల్లి రెవెన్యూలోని సుచిర్ ఇండియా లేఔట్లో గల ఒక గెస్ట్ హౌస్, నిర్మాణంలో ఉన్న క్లబ్ హౌస్‌ను హెచ్ఎండీఏ అధికారులు సోమవారం సీజ్ చేశారు. అలాగే తూంకుంటలో రెండు అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ స్వరూప, మున్సిపల్ ప్లానింగ్ ఆఫీసర్ మేఘన, హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ టీం, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు