Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
కొమురవెల్లి ఆలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్న విషయంపై విచారణ చేపట్టాలని తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు గంగుల మధు యాదవ్, బీణవేనీ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. సందర్భంగా గంగుల మధు యాదవ్ మాట్లాడుతూ ఇటీవల పదిమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ఓ ప్రయివేటు ఏజెన్సీ ద్వారా నియామకం జరుపుతూ ఉద్యోగుల వద్ద ఒక్కో వ్యక్తి నుంచి రెండు నుంచి మూడు లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణుల ఉన్నాయన్నారు. ప్రయివేట్ ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ను రద్దు పరిచి జిల్లా కలెక్టర్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మీడియా ప్రెసిడెంట్ రసాల శ్రీశైలం యాదవ్, జె. దేవేందర్ యాదవ్, కన్నెబోయిన సత్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.