Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
వంజరి కులస్తులు రాజకీయంగా, ఆర్థికపరంగా అన్ని విధాలుగా ఎదగాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. సోమవారం గోల్నాక డివిజన్ పరిధిలోని తులసినగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వంజరీ సంఘం రాష్ట్ర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజరు కుమార్ గౌడ్, వంజారి సంఘం రాష్ట్ర నాయకులు కాలేరు నరేందర్, లవంగ ఆంజనేయులు, కాలేరు శ్రీనివాస్, అనిల్, కాశీ నరేష్, లవంగ నాగరాజు, వంజరి నాగరాజ్, ఎంసీ రాజు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు సిద్ధార్థ్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.