Authorization
Fri March 21, 2025 02:06:28 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్నగర్ చౌరస్తాలో ఆర్సీసీ పైప్ లైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి సోమ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వినాయక్నగర్ చౌరస్తా నుంచి రైల్వే గేట్ వరకు డ్రయినేజీ సమస్య ఎప్పటినుంచో ఉందని నేటితో ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రూ.10 లక్షలతో ఆర్సీసీ పైప్ లైన్ పనులు తొందర్లోనే పూర్తవు తాయని తెలిపారు. అనంతరం వినయకనగర్లోని లేను నంబరు 29లో ఏఈ దీపక్, వర్క్ ఇన్స్పెక్టర్ సాగర్తో కలిసి పర్యటించి అక్కడి సమస్యలను ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓం ప్రకాష్, చంద్ర శేఖర్, శ్రీకాంత్ యాదవ్, రాకేష్ యాదవ్, అజరు, ఉడత నవీన్, వడ్డరి రాజు, జహంగీర్, కృష్ణ, రాంప్రసాద్, సురి, సంతోష్ యాదవ్, మహేష్, కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.