Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
గంగపుత్రుల సమస్య లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిం చేందుకు తన వంతు కృషి చేస్తానని టీఆర్ఎస్ హైదరా బాద్ జిల్లా అధ్యక్షులు, జూబ్లి హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం నగర కార్యనిర్వాహక అధ్యక్షు డు సింగీతం సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో మాగంటి గోపినాధ్ను సోమవారం సత్కరించి చేపలను బహుకరించారు. నగరంలో గంగపుత్రులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసు కువెళ్ళారు. ఈ సందర్భంగా మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో గంగపు త్రులు చేపలు విక్రయించడానికి సరైన మార్కెట్ వసతుల్లేక బహిరంగ ప్రదేశాల్లో అమ్మకాలు సాగిస్తూ అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. చేపల విక్రయాలకు అనువైన మార్కెట్ సదుపా యాలు కల్పించడంతో పాటు మార్కెట్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రతి ఏడాదీ ట్యాంకు బండ్ వద్ద నిర్వహించే తెప్పోత్సవాలను ప్రభుత్వమే నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం ప్రతినిధులు సింగీతం శ్రీనివాస్, రాచగొండ శివ, రఘుబాబు, వెంకట్, మల్లేష్, శ్రీకాంత్, ప్రవీణ్, మహేష్ ముకేష్ పాల్గొన్నారు.