Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆరోగ్య సంరక్షణకు బడ్జెట్ పెంచాలని అపోలో హాస్పిటల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సునితారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దశాబ్ద కాలంలో దేశ జనాభా 15 శాతం పెరిగినప్పటికీ అందుకు తగ్గట్టుగా ఆరోగ్య సంరక్షణ వ్యయంలో సమానమైన అభివృద్ధి లేదని తెలిపారు. బడ్జెట్లో ప్రజారోగ్య వ్యయాన్ని 2.5 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (యు హెచ్.సి) లక్ష్యాలకు మద్దతు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరినీ ఆరోగ్య కవరేజ్లోనికి తీసుకువచ్చేందుకు ప్రత్యామ్నాయ ఫైనాన్సింగ్ విధానాలను అందుబాటులోనికి తీసుకురావాలని కోరారు.