Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
గౌతంనగర్ డివిజన్ పరిధిలోని ఉత్తమ్‌నగర్‌లో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను సోమవారం స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో డివిజన్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు తెలిపారు. స్థానిక కాలనీవాసులు ఏ సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమా ణాలు పాటిస్తూ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ దివ్యజ్యోతి, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాము యాదవ్, తదితరులు పాల్గొన్నారు.