Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
ఫొటోగ్రఫీ మనిషిలో భావాలను చిత్రీకరించేది మాత్రమే కాకుండా భావితరాలకు చరిత్రను భద్రప రిచేది కూడా అని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవి కుమార్ అన్నారు. ఎన్నో సామాజిక ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక ఔన్నత్యం భావితరాలకు అందించేందుకు ఫొటోగ్రఫీ అకా డమీని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోసి యేషన్ డైరీ-2022 ఆవిష్కరణ కార్యక్రమానికి పల్లె రవి కుమార్ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఫొటోగ్రాఫర్లది అనిర్వచనీయమైన పాత్ర అని కొనియాడారు. ఎలాంటి భద్రత, సౌకర్యాల్లేకుండా అసంఘటిత రంగంలో బతుకులు వెళ్లదీస్తున్న ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సంక్షే మం కోసం తగిన కార్యక్రమాలు చేప ట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభు త్వంపై ఉన్నదని గుర్తు చేశారు. అందు కు నిర్దిష్ట కార్యాచరణతో ఐక్యపోరా టానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాస్ రావు, తెలంగాణ ఫొటో గ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు రవీందర్, ప్రముఖ న్యాయవాది వేణు మాధవ్, బీసీ రచయితల వేదిక అధ్యక్షుడు బైరు శేఖర్, సంఘం నాయకులు గుండు కరుణాకర్ గౌడ్, విగేశ్వర్ యాదవ్, పల్లె లక్ష్మీదాస్ గౌడ్, సంజీవ, ఉద్యమ కుమార్, తదితర నాయకులు పాల్గొన్నారు.