Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
అంబర్‌పేట నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్కు లను అందంగా తీర్చిదిద్దుతున్నట్టు ఎమ్మెల్యే కాలేరు వెంక టేష్ అన్నారు. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట డివిజన్లలో ఉన్న పార్కులను అభివృద్ధి పరిచి ప్రజలకు ఆహ్లాదకర వాతా వరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పా రు. సోమవారం అంబర్‌పేట డివిజన్ పరిధిలోని అనంత రాంనగర్లో జీహెచ్ఎంసీ ఉద్యానవనశాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణ, అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజరు కుమార్‌గౌడ్, బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్ బి.పద్మా వెంకటరెడ్డితో కలిసి పార్కు, బాగ్‌అంబర్‌పేట సోమసుం దర్నగర్లోని సీతామహాలక్ష్మీ పార్కుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాంత్రిక జీవనానికి అలవాటు పడిన ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ప్రతి కాలనీలో పిల్లలు ఆడుకునేందుకు, వృద్ధులు వాకింగ్ చేసేందుకు పార్కులను అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరామ్నగర్ పార్కులో మొదట్లో ఆర్చి, మంచి వాతావరణం కోసం మొక్కలు, టైల్స్, బెంచీలు, కమ్యూనిటీహాల్, యువతకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీన్ని మోడల్ పార్కుగా తయారు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్ర మంలో డీఈ సుధాకర్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, వివిధ పార్టీల నాయకులు చుక్క జగన్, మహేష్ ముదిరాజ్, సంతోష్‌చారి, నాగరాజు, గోపాల్‌గౌడ్, రాజేశ్వరి, అతీక్, కెంచె మహేష్, రవి, తదితరులు పాల్గొన్నారు.