Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం/సరూర్నగర్/కాప్రా
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాలని సీఐటీ యూ, ఏఐకేఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాం డ్ చేశారు. రైతులకు, రైతు అమర వీరులకు పరిహారం చెల్లించా లని, ఉద్యమంలో రైతులపై బనాయించిన కేసులు ఎత్తివేయాలని కోరారు. లఖింపూర్ఖేరి ఘటనలో రైతుల చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రైతాంగాన్ని విస్మరించడాన్ని నిరసిస్తూ సోమవారం విద్రహ దినంగా పాటిస్తూ నిరసనలు చేపట్టారు.
ఆటోనగర్ పారిశ్రామికవాడలో..
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఆటో నగర్ ఇంస్ట్రియల్ ఏరియాలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిం చారు. సీఐటీయూ జిల్లా పాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి మాట్లాడు తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్రోహ చర్యలను ప్రజలు ప్రజాతంత్ర వాదులు తీవ్రంగా ఖండించాలన్నారు. విద్యుత్ చట్ట సవరణ రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 21000 తగ్గకుండా ఇవ్వాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ పెంచి, దానిని పట్టణ ప్రాంతాల్లో ప్రాంతాలకు విస్తరిం చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయ కులు బి.భాస్కర్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు బి. కనకయ్య, రైతు సంఘం నాయకులు దోనూరూ కష్ణారెడ్డి, నాయకులు హను మంతు, సుధీర్, ఉద్ధవ్, గణేష్ గణపతి, పాండు, శేఖర్, అశోక్, దయానంద్, ఎస్.నరసింహ, లింగయ్య, వెంకన్న పాల్గొన్నారు.
నందనవనంలో..
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల నందనవనంలో సీఐటీ ుూ ఎల్బీనగర్ సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ నాయకులు ఎల్బీనగర్ సర్కిల్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఎల్బీనగర్ సర్కిల్ కమిటీ సభ్యులు ఎం.డి కమర్, దుర్గారావు, శ్రీనివాస్ యాదయ్య లు పాల్గొన్నారు.
సరూర్నగర్లో..
సీఐటీయూ సరూర్నగర్ సర్కిల్ ఆధ్వర్యంలో నిరసన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ సంఘం కన్వీనర్ మల్లె పాక వీరయ్య మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధరను అమలు చేయాల ని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు, రంగారెడ్డి జిల్లా ఆటో ట్రాన్స్పోర్ట్ యూనియన్ సహాయ కార్యదర్శి కె. రాములు, వత్తి సంఘాల నాయకులు, సీహెచ్ మల్లేష్, ఆంజనేయులు, వీర స్వామి, బిక్షపతి, వెంకన్న, వీరన్న, వెంకటేష్, మల్సూర్, ప్రవీణ్, స్వామి, నరసింహ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
కాప్రాలో..
దేశవ్యాప్తంగా విద్రోహ దినం పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం సీపీఐ(ఎం) కాప్రా సర్కిల్ కమిటీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు యాదగిరి రావు అధ్యక్షతన విద్రోహ దినంగా పాటం చారు. ఈ సంద ర్భంగా సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోమటి రవి, కాప్రా సర్కిల్ కార్యదర్శి పి.వెంకట్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు, ఉన్నికృష్ణన్, నాయ కులు చారి, ఎం.శ్రీనివాసరావు, శంకర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏడాది కిపైగా తమ పోరాటాన్ని కొనసాగించారనీ, ఈ పోరాటాన్ని నీరుగార్చడానికి మోడీ ప్రభుత్వం ఈ పోరాటంలో విదేశీ శక్తులు ఉన్నాయనీ, ఖలిస్తాన్ తీవ్రవాదులు ఈ పోరాటంలో చొర పడ్డారనీ, దేశద్రోహులు ఈ పోరాటంలో ఉన్నారని దుష్ప్ర చారాలు కొనసాగించారన్నారు.ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం దిగివచ్చి రైతాంగం సమస్యలను పరిష్కరించాలనీ, కార్మిక చట్టాల ను మార్పులు చేస్తూ తీసుకువచ్చినా నాలుగు కోడ్లను రద్దు చేయాలనీ, విద్యుత్ సవరణ బిల్లును కూడా వెంటనే ఉపసం హరించుకోవాలనీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసం హరణ కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో రాబోయే ఎన్నికల్లో మోడీకి తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముత్తయ్య శ్రీను, సూరి సోమయ్యచారి, తదితరులు పాల్గొన్నారు.