Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ ఆర్ట్స్ కళాశాల ఫిలాసఫీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ తుమ్మ కృష్ణరావు మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఆయన గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా రెండుసార్లు, డైరెక్టర్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్, డైరెక్టర్, ఓయూ ఓఎస్డీగా, డైరెక్టర్ అంబేద్కర్ స్టడీ సెంటర్, ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్, ఫిలాసఫీ డిపార్ట్మెంట్ హెడ్‌గా, యూజీసీ రీజినల్ కో ఆర్డినేటర్‌గా పలుమార్లు ఇన్చార్జ్ వీసీగా సేవలు అందించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వీసీ ప్రొ. చోల్లేటి.గోపాల్ రెడ్డి సమక్షంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింత గణేష్, విభాగం విద్యార్థులు ఆయన్ను ఘనంగా సన్మానించారు.