Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ నాయకుడు యుగంధర్ రెడ్డి
నవతెలంగాణ-బాలానగర్
బాలానగర్‌లోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన మందుల పరిశ్రమ(ఐడీపీఎల్)పై సమగ్ర భూ సర్వే నిర్వహించాలని కాంగ్రెస్ జిల్లా సంయుక్త కార్యదర్శి మాది రెడ్డి యుగంధర్ రెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీశ్‌కు నతిపత్రం అందజేశారు. ఐడీపీఎల్ భూములపై సర్వే నిర్వహించాలని గతంలో సంబంధిత ఎమ్మార్వో, ఆర్డీఓలకు వినతిపత్రం అందజేశామని, కాగా దాదాపు మూడు నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. త్వరలోనే కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వశాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బందీగా బాలనర్సింహా, ఆకుల నరేందర్, నిసార్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.