Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రాష్ట్రంలో నెలకొల్పనున్న మహిళా విశ్వవిద్యాలయానికి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే పేరును పెట్టాలని భారతీయ విద్యార్థి మోర్చా (బీవీఎం) రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ బట్టు డిమాండ్ చేశారు. సోమవారం భారతీయ విద్యార్థి మోర్చా, సావిత్రి మాతా సైన్యం సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన మహిళ శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించి, సీఎం కేసీఆర్ దష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో భారతీయ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దయ్య రఘువీర్, బీవీఎం రాష్ట్ర కార్యదర్శి రాథోడ్ శ్రీనివాస్, ఇన్ ఛార్జి రవితేజ, సావిత్రిమాతా సైన్యం రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి, మేఘన, ప్రియాంక, సరస్వతి, బీవీఎం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు అరుణ్ నాయక్, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు కోట కపిల్, జిల్లా నాయకులు అధిపతి, అరవింద్ పాల్గొన్నారు.