Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్
ఎస్. మధుసూదనచారి
నవతెలంగాణ-కల్చరల్
స్వాతంత్య్ర ఫలాలు సామాన్యుడికి చేరినప్పుడే నిజమైన స్వతంత్య్రం దేశానికి వచ్చినట్లని శాసన సభ తొలి సభాపతి ఎస్. మధుసూదనచారి అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభ ప్రధాన వేదికపై ప్రముఖ సామాజిక సాంస్కతిక సంస్థ 'శిఖరం ఆర్ట్స్' నిర్వహణలో అజాది కా అమతోత్సవ్ పేరిట వందే భారతి శీర్షికన బాల బాలికలు దేశ భక్తి గీతాలను అలపించి నర్తించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. అనంతరం జరిగిన సభకార్యక్రమంలో ముఖ్య అతిథిగా మధుసూదనచారి పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్య్ర సాధనకు ఎందరో తమ జీవితాలను త్యాగం చేశారని, ఆ మహనీయుల కలలు విఫలం కాకూడదని అన్నారు. కేంద్ర పూర్వ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారి మాట్లాడుతూ నేటి తరం స్వాతంత్ర వీరుల జీవితాలు తెలుసుకోవాలని అప్పుడే స్వాతంత్య్రం విలువ తెలిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు జాన్ బాబు, లలితా రాణి, షేక్ పర్వజ్, రాజ్ కుమార్, మహేష్ రెడ్డి, రేణుక, మీనా గోపి లను సేవా భారతి పురస్కారాలతో సత్కరించారు. వేదికపై నాట్య గురువు ఎస్.పీ భారతి తదితరులు పాల్గొనగా సంస్థ నిర్వాహకుడు జీ.కష్ణ స్వాగతం పలికారు. దత్తు, సాయి ప్రియ వ్యాఖ్యానం ఆకట్టుకొంది.