Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట కొండపై వెలసిన శ్రీశ్రీశ్రీ శివ పంచాయతన సహిత మార్కండేయ స్వామి ఆలయంలో ఈ నెల 3న నిర్వహించే మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని పద్మశాలి సంఘం అధ్యక్షులు మునిపల్లి జనార్థన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయంలో ఉదయం 5 గంటలకు అభిషేకం, స్వామి వారి అలంకరణ, 8 గంటలకు హోమం, 10 గంటలకు సంజరుపురికాలనీ నుంచి ఉరేగింపుగా వచ్చి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పణ, పల్లకి సేవ, మధ్యాహ్నం 1:30 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సంఘం సభ్యులు, నాయకులు, భక్తులు హాజరై కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.