Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
శామీర్పేట మండలం అనంతారం గ్రామానికి చెందిన నిర్గడి కొమురయ్య అకాల మరణం చెందారు. సమాచారం అందుకున్న కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి సాయం చేయాలని స్థానిక సర్పంచ్ మెరుగు నర్సింహ రెడ్డిని ఆదేశించారు. కాగా సర్పంచ్ మతుని ఇంటికివెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంత్యక్రియల నిమిత్తం రూ. 5వేలు అందజేశారు. కార్యక్రమంలో మండల కో ఆప్షన్ షేక్ గౌస్ పాషా, టీఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.