Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్మెట్
నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఫీవర్ సర్వే చేయించుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం గాంధీనగర్ డివిజన్లోని పలు బస్తీలలో డాక్టర్లు, ఆశావర్కర్లతో కలిసి జ్వరం సర్వేలో పాల్గొన్నారు. ప్రజలకు సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జ్వరం, దగ్గు జలుబుతో బాధపడే వారిని గుర్తించి వారికి ప్రత్యేక కరోనా కిట్టు అందిస్తున్నామని చెప్పారు. అత్యవసరం అయితే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రత్యేక చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. సామాన్య జలుబు, దగ్గుకు ప్రజలు భయపడాల్సిన పని లేదని హోమ్ ఐసోలేషన్లో ఉండి తగు జాగ్రత్తలతో మందులు వాడితే త్వరగా నయం అవుతుందని తెలిపారు. ప్రజలు విపత్కర పరిస్థితిని దష్టిలో ఉంచుకొని మాస్కులు విరివిగా ధరించాలని సూచించారు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ శానిటైజర్ వాడుతూ భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మా నరేష్, డివిజన్ అధ్యక్షులు రాకేష్, మారిశెట్టి నర్సింగ్ రావు, ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు