Authorization
Wed March 19, 2025 12:06:44 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
పోరాటాలతోనే కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ అన్నారు. మంగళవారం బాలాపూర్ మండల నాయకులు కిషోర్ అధ్యక్షతన బడంగ్పేట్ భవన నిర్మాణ కార్మికుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు చంద్రమోహన్, నిరంజన్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. అసంఘటిత కార్మికులకు సాంఘిక భద్రత చట్టం 2008 ప్రకారం కార్మికులకు శ్రమయోగి మాన్ ధన్ పింఛన్ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు కూర్పయ్య, ప్రధాన కార్యదర్శి చిన్నబాయి, కోశాధికారి మాధవ్, నాయకులు శ్యాం, యాదయ్య, రాము, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.