Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గం పరిధిలోని పార్క్‌లను అభివృద్ధి పరుస్తున్నామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గోల్నాకలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం జీహెచ్ఎంసీ అధికారులతో నియోజకవర్గంలోని వివిధ అభివద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్క్‌లలో సామాన్య ప్రజలు సేదతీరేందుకు నూతన పార్కుల నిర్మాణం ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. రహదారులపై డివైడర్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలు లేకుండా సజావుగా వాహనదారులు గమ్యాన్ని చేరుకునేలా కషి చేయాలని అన్నారు. ట్రాఫిక్ పీఎస్ నుంచి ఎంఆర్వో ఆఫీసు మీదుగా పటేల్‌నగర్ వరకు ఫుట్‌పాత్ అభివద్ధి పనుల సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, పార్క్‌ల సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో రోడ్ల సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటికి కారణాలను అధ్యయనం చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఈఈ శంకర్, డీఈలు సువర్ణ, సుధాకర్, ఏఈలు ప్రేరణ, శ్వేత, దివ్య, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, మనోహర్, ఎలక్ట్రికల్ డీఈ వెంకటరమణరెడ్డి, కాచిగూడ ఏఈ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.