Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. కోవిడ్ కారణంగా సరైన మార్కెట్ లేక లేజర్ షేవింగ్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ కార్మికులకు నూతన వేతన ఒప్పందం చేయకపోవడంతో మాజీ ఎమ్మెల్యే యజమాన్యంతో చర్చలు జరిపి కార్మికులకు నూతన వేతన ఒప్పందం చేయడానికి యజమాన్యాన్ని ఒప్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన గేటు మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఎటువంటి సమస్య వచ్చిన ఎల్లప్పుడు అండగా ఉంటానన్నారు. నూతన వేతన ఒప్పందం చేయడానికి యజమాన్యాన్ని ఒప్పించిన మాజీ ఎమ్మెల్యేకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ కో అర్డినేటర్లు అబ్దుల్ అఫీజ్, వినోద్‌కుమార్, ఇతర అఫిస్ బేరర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.