Authorization
Fri March 21, 2025 01:48:04 pm
కార్పొరేటర్ విజయకుమార్ గౌడ్
నవతెలంగాణ-అంబర్‌పేట
బాపూనగర్‌లోని వీధి దీపాలు, విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు, డ్రయిజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ ఇ.విజరు కుమార్‌గౌడ్ అన్నారు. మంగళవారంఅంబర్పేట డివిజన్ బాపునగర్ సిబ్లాక్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు డ్రయినేజీ, వీధి దీపాలు, విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మల తొలగింపు వంటి సమస్యలను కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రయినేజీ సమస్యలతో పాటు విద్యుత్ దీపాలు, ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మల తొలగింపు వంటి సమస్యలను సంబంధిత అధికారుల దష్టికి తీసుకు వెళ్లి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక బస్తీ వాసులు మహ్మద్ షబ్బీర్, మహ్మద్ ఖదీర్, బాబు మియా, సయ్యద్ గఫూర్, ఎండి నజీర్, మహ్మద్ సాజీద్, మహ్మద్ సాహిర్, ఒబేద్, మహ్మద్ నసీరుద్దీన్, అబ్బుల్ హుస్సేన్, ఆఫ్రోజ్ ఖాన్, సయ్యద్ ఇమ్రాన్ ఖాజా బారు, సఖీఖాన్, నజీర్, టీఆర్ఎస్ నాయకులు వేణు, సంతోష్ చారి పాల్గొన్నారు.