Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆర్థిక పద్దు ప్రగతిశీలమైనదని కేేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈఓ జగదీష్ సింగ్, మిస్టర్ వికాస్ రస్తోగి అన్నారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక పద్దు సందర్భంగా వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. దేశం మొత్తం డిజిటల్ రిజిస్ట్రీలు, వర్చువల్ హెల్త్, హెల్త్‌కేర్ ఎకోసిస్టమ్ భవిష్యత్తులో దేశవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను నడపడానికి సహాయపడుతుందన్నారు. బహిరంగ వేదిక కోసం తాము ఎదురు చూస్తున్నామన్నారు. కాంపెక్స్, రోడ్లు, రైల్వేల పరంగా ప్రభుత్వ రంగ పెట్టుబడులు మౌలిక సదుపాయాల అభివద్ధికి పెద్దపీట వేయడాన్ని కూడా తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.