Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య
నవతెలంగాణ-అడిక్‌మెట్
కేంద్ర బడ్జెట్లో బడుగుల ఊసే లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య అన్నారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2022-23 బడ్జెట్‌పై జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ అధ్యక్షతన బీసీ భవన్లో జాతీయ ముఖ్య నాయకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో బీసీలకు 74 ఏండ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని ఆరోపించారు. దేశ సంపద సష్టిలో బీసీల పాత్ర అమితంగా ఉన్నా, సంపదలో వారికి వాటా కల్పించరా? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని పలుమార్లు ప్రధానమంత్రి మోదీకి, పలు కేంద్ర మంత్రులకు విన్నవించినా కేంద్రానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తన వ్యతిరేక వైఖరిని వెంటనే మార్చుకోకపోతే బీసీలంతా ఏకమై పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ మాట్లాడుతూ దేశంలోని 6వేల బీసీ కులాలను ఆదుకునేలా బడ్జెట్‌ను పున: సమీక్షించాలన్నారు. సమావేశంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కష్ణ, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు జి.అనంతయ్య, విద్యార్థి విభాగం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, మహిళా విభాగం జనరల్ సెక్రటరీ మట్ట జయంతి గౌడ్, రాష్ట్ర సెక్రటరీలు లింగాల హరీష్ గౌడ్, పాక శ్రీనివాస్ యాదవ్, నాయకులు కష్ణ యాదవ్ పాల్గొన్నారు.