Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
అసంపూర్తిగా ఉన్న పనులను సత్వరమే పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎనిమిది డివిజన్లలో చేపట్టే పలు అభివృద్ధి పనులపై మంగళవారం పేట్‌బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇంజినీరింగ్, ఇరిగేషన్ విభాగం అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం అభివృద్ధికి ఎన్ని నిధులైన సమకూర్చడానికి సిద్దంగా ఉన్నారన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ప్రధాన రహదారులను అనుసంధానం చేస్తూ లింక్ రోడ్డులు చేపట్టాలన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి అధికారులు సమన్వయంగా ముందుకు సాగాలన్నారు. సమావేశంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, ఉప కమిషనర్లు మంగతాయారు, ప్రశాంతి, కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు కె.ఎం.గౌరీష్, సురేష్‌రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3,84,19,544 కోట్ల విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంగళవారం చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో 384 మంది లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పైరవీలు, మోసాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అందిస్తూ వివాహం చేసుకున్న ప్రతి అడపడుచుకు మేనమామలా సీఎం కేసీఆర్ నిలిచారన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, మాజీ కార్పొరేటర్ కె.ఎం.గౌరీష్, నాయకులు సయ్యద్ రశీద్, కస్తూరి బాలరాజు, సంపత్ మాధవరెడ్డి, సిద్దిక్, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.