Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
ముషీరాబాద్ డివిజన్ పరిధిలోని బాపూజీనగర్, గంగపుత్ర కాలనీ, కళాధర్ నగర్, మోహన్ నగర్ తదితర బస్తీల్లో వారం రోజులుగా డ్రయినేజీ వాటర్ రోడ్లపై పారడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని కార్పొరేటర్ ఎం సుప్రియ నవీన్ గౌడ్ అన్నారు. దీనిపై వాటర్ వర్క్స్ అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని, వారి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మంగళవారం ముషీరాబాద్‌లోని జలమండలి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వారం పది రోజులుగా డివిజన్ పరిధిలో పలు బస్తీల్లో డ్రయినేజీ సమస్య తలెత్తడంతో సంబంధిత అధికారుల దష్టికి తీసుకోకపోయినా పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్య వైఖరిని వీడనాడి ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యం కావాలని సూచించారు. అనంతరం జలమండలి జీఎం సుబ్బరాయుడు, డీజీఎం ాహెద్ రేపటికల్లా సమస్యను పరిష్కరిస్తామని అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ నవీన్ గౌడ్, బీజేవైఎం నగర కార్యదర్శి అనిల్ కుమార్, డివిజన్ అధ్యక్షులు సంతోష్, నాయకులు సురేష్, అజరు గుప్తా తదితరులు పాల్గొన్నారు.