Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలోని పంచవతి కాలనీలో నాలాపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను జీహెచ్ఎంసీ ఏఈ రషీద్‌తో కలిసి పర్యవేక్షించిచారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ప్రధానంగా సాయినగర్, వినాయిక్ నగర్ నివాసితులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని, బ్రిడ్జి నిర్మాణంపూర్తయితే సమస్య తీరనుందని చెప్పారు. కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ రాములు, దేవులపల్లి కష్ణమూర్తి, నర్రా దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, ఆదిమూల నాగేష్, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.