Authorization
Mon March 17, 2025 11:49:13 am
నాంపల్లి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ వర్మ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
డీజే సౌండ్, నృత్యాలు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న బార్లపై కేసులు నమోదు చేశామని నాంపల్లి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ వర్మ తెలిపారు. మంగళవారం ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నాంపల్లి ఎక్సైజ్ పరిధిలో ఉన్న బార్లలో ఎలాంటి డీజేలు, డ్యాన్స్ లాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు, వ్యసనాలకు గురికావద్దు యువతకు సూచించారు.