Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రెడ్‌క్రాస్ సేవలు అభినందనీయం అని ఓయూ వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్ అన్నారు. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో మంగళవారం ఓయూలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 500 మందికి మాస్కులు, కరోనా నివారణ మెడిసిన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, డీన్ ఆఫ్ సైన్సెస్ ఆచార్య బాలకిషన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, మాట్లాడుతూ ఆపత్కర పరిస్థితుల్లో రెడ్ క్రాస్ సంస్థ అందించిన సేవలు అభినందనీయన్నారు. చైర్మెన్ మామిడి భీం రెడ్డి మాట్లాడుతూ కోవిడ్‌ని ఎదుర్కోవాలి అంటే మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని చెప్పారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కోవిడ్‌కి గురైన వారికి ఉచితంగా కిట్ అందజేయనున్నట్లు చెప్పారు. కోవిడ్ మందులు, సలహాలు కావాల్సిన వారు 94918 83595 నంబరుపై సంప్రదించవచ్చు అని సూచించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సలహా సభ్యులు డాక్టర్ విజరు భాస్కర్, మధుబాబు చికిలే, మామిడి రిషికేశ్, కిరణ్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.