Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాతబస్తీలో హిజాబ్ డే వేడుకల్లో సాలెహా
యువతులకు కానుకగా స్కార్ఫ్ల పంపిణీ
నవతెలంగాణ-ధూల్‌పేట్
హిజాబ్ మగువల హుందాతనానికి నిదర్శనమని జమాఅతె ఇస్లామీహింద్ చార్మినార్ శాఖ నాయకురాలు సాలెహా అన్నారు. వరల్డ్ హిజాబ్ డే వేడుకలు పాతబస్తీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జమాఅతె ఇస్లామీహింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు యువతులు, మహిళలకు హిజాబ్ వస్త్రాన్ని కానుకగా అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిజాబ్ మగువల హుందాతనంతో పాటు రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని అన్నారు. అమ్మాయిల ఆలోచన ధోరణి మారుతోందని, ధుమ్ము, ధూళి ఇతర కాలుష్యాల బారినుంచి స్కార్ఫ్‌ను రక్షణ సాధనంగా ఉపయోగిస్తున్నారని ఆమె అన్నారు. అనంతరం వెంకట్రావ్ మెమోరియల్ స్కూల్, దారుషిఫా, పంజెషా, యూనానీ ఆస్పత్రుల్లోని డాక్టర్లు, నర్సులకు హిజాబ్‌ను కానుకగా అందించారు. ఈ వేడుకల్లో జమాఅతె ఇస్లామీహింద్ మహిళా నాయకులు తహూరా సిద్దీఖా, హుమేరా తదితరులు పాల్గొన్నారు.