Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్స్ అఫీషియో హోదాలో హాజరైన ఎమ్మెల్యే సాయన్న
నవతెలంగాణ-కంటోన్మెంట్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యుల సర్వసాధారణ సమావేశం గురువారం సాయంత్రం బోర్డు కార్యాలయంలో వాడివేడిగా జరిగింది. బ్రిగేడియర్ అభిజిత్‌చంద్ర, సీఈఓ అజిత్‌రెడ్డి, సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు జె.రామకష్ణ, ఎక్స్ అఫీషియో సబ్ హోదాలో ఎమ్మెల్యే సాయన్న హాజరయ్యారు. పలు అభివద్ధి అంశాలపై అధికారులతో చర్చించారు. గత బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టిన ఎఫ్ఎస్ఐ మినహాయింపులకు సంబంధించి విధి, విధానాలను బోర్డులో ప్రకటించారు. సిఖ్ విలేజ్‌లో ప్రతిపాదిత మహిళా హాస్టల్ నిర్మాణానికి అదనంగా రూ.1కోటి నిధుల కేటాయింపు, బొల్లారంలో నిర్మించిన కమ్యూనిటీ హాలుకు అంబేద్కర్ పేరు ఖరారు, పెన్షన్లైన్ నుంచి ఫైజాన్ స్కూల్‌కు రోడ్డు నిర్మాణానికి బీ4 స్థలం కేటాయింపు, ఇంటింటి చెత్త సేకరణ పన్ను విధింపు, బోర్డు స్థలాల నుంచి ఆదాయ మార్గాల అన్వేషణ వంటి కీలక అంశాలకు బోర్డు ఆమోదం తెలిపింది. సీవరేజీ, తాగునీటి పైపులైన్లు, విద్యుత్ పోల్స్ తదితర పనులకు సంబంధించి కాంట్రాక్టులకు బోర్డు ఆమోదించింది. బొల్లారంలో నిర్మించిన కమ్యూనిటీ హాలుకు అంబేద్కర్ పేరు ఖరారు చేయడంతో పాటు ఒక్కరోజు వినియోగానికి రూ.5వేల చొప్పున చార్జీలను ఖరారు చేశారు. పెన్షన్లైన్ నుంచి ఫైజాన్ స్కూల్‌కు వెళ్లేందుకు అనువుగా సుమారు 1600 గజాల బీ4 స్థలం కేటాయింపునకు గాను, దీన్ని సీ కేటగిరీలోకి మార్చాలని నిర్ణయించారు. అలాగే బోర్డు స్థంలో నిర్మించిన జైన్ చారిటబుల్ ట్రస్టు ఆసుపత్రికి అనుమతులు మంజూరు చేశారు. ఇంటింటి చెత్తసేకరణకు సంబంధించి బస్తీలో ఇంటికి రూ.50, కాలనీల్లో రూ.100 చొప్పున నెలసరి పన్ను విధింపునకు బోర్డు ఆమోదం తెలిపింది. జూబ్లీ బస్‌స్టేషన్‌లోని సమీపంలోని బోర్డు స్థలంలో కొంత భాగంలో మల్టీపర్పస్ పార్కింగ్, సిఖ్ విలేజ్‌లోని సుమారు ఆరున్నర ఎకరాల స్థలాన్ని క్రీడాకారుల కోసం కేటాయించేందుకు బోర్డు తీర్మానం చేసింది. బోర్డు ఆధ్వర్యంలోనే ఉన్న బైసన్ పోలో మైదానాన్ని సైతం స్థానిక క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా అభివద్ధి చేయాలని నిర్ణయించారు. మడ్‌ఫోర్ట్‌లోని గుడిసెలకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని బోర్డు సభ్యుడు రామకష్ణ కోరగా, ఆర్మీ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వలేమన్నారు. దీంతో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని రామకష్ణ కోరగా, పది ఇళ్లకు ఒక్కటి చొప్పున నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.