Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దమ్మాయిగూడలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడిన సీఎం కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్‌రెడ్డి, దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు రామారావులు అన్నారు. గురువారం ఇక్కడి అంబేద్కర్ విగ్రహంవద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. దమ్మాయిగూడలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లోల కుమార్, దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పంబల్ల రమేష్, పొట్ట శ్రీశైలం, పొట్ట మల్లేష్, బాలరాజ్, మల్లేష్, బలరాం, విగేశ్, భాస్కర్, శ్రీకాంత్ రెడ్డి, కుమార్ పాల్గొన్నారు.