Authorization
Fri March 21, 2025 03:25:57 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు, సీఎం కేసీఆర్‌ను అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు మామిడి రామ్‌చందర్ అన్నారు. రాజ్యాంగం పట్ల సీఎం వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ఎల్బీనగర్లోని అంబేద్కర్ విగ్రహా నికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ... ప్రభుత్వ వైఫల్యంవల్ల, టీఆర్ఎస్ నాయకులను ప్రజలు మరిచిపోతున్నారనే అక్కసుతో, ప్రతి రోజూ వార్తల్లో ఉండాలని ఇష్టంవచ్చినట్లు మాట్లాడడం తెలంగాణ ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. కేసీఆర్ వెంటనే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అజరు, రవి, వెంకటేష్, నగేష్, శశికళ, రాంకోటి, వాసు, చంద్రశేఖర్, అశోక్, చెన్నమ్మ, కోమల, సిద్దేశ్వర్, కష్ణ, నరేష్, రాము, శ్రీనివాస్, కుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.