Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
రాజకీయంగా తాను ఎదుగుతుంటే ఓర్వలేకనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బోడుప్పల్ 5వ డివిజన్ కార్పొరేటర్ సింగి రెడ్డి పద్మారెడ్డి అన్నారు. గురువారం నాడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడు తూ టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి తనపై ఓడిపోయిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి నేను దాడిచేయించానని తప్పుడు ఆరోపణలు చేస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నారని అన్నారు. కాలనీలో దేవాలయం లెక్కలు అడిగితే ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడింది అతనేనని, పైగా తనపై దాడి జరిగిందని ప్రచారం చేసుకుంటూ దిగజారుడు విమర్శలు చేస్తున్నాడని వాపోయాడు. ఇప్పటికైనా తనపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని, లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.