Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీఎఫ్ కార్యాలయం వద్ద బాధితుల నిరసన
నవతెలంగాణ-కూకట్పల్లి
కేంద్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ఈపీఎఫ్ కార్మికుల పెన్షన్ గోడును పట్టించుకోవడంలేదని, దీనివల్ల వారి కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యని ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షులు, రాష్ట్ర పెన్షనర్ల సంఘం (టీఏపీఆర్పీఏ) గౌరవ అధ్యక్షులు ఎంఎన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈమేరకు బుధవారం తెలంగాణ ఆల్పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కూకట్పల్లి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో కూకట్పల్లిలోని ఈపీఎఫ్ కార్యాలయం వద్ద విశ్రాంత పెన్షనర్లు నిరసన తెలియ జేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షులు, ఎన్ఎన్ రెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో అసంఘటిత కార్మిక రంగానికి మేలు జరగలేదని, ఏ సమస్య కూడా పరిష్కరిం చలేదని చెప్పి, తాము అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా దాటవేత ధోరణి తప్ప సమస్యను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏండ్లు గడుస్తున్నా రిటైర్డ్ కార్మికుల, ఉద్యోగుల పెన్షన్ సమస్యను మాత్రం పరిష్కరించడంలేదన్నారు. ప్రజా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ బడ్జెట్ సమావేశాల్లో పెన్షన్ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. ప్రధానంగా ఐఎం పవర్ కమిటీ నివేదికను బయటపెట్టాలని, కనీస పెన్షన్ రూ.9000 ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగు ణంగా కరువు భత్యం చెల్లించాలని, ఉచిత వైద్య వసతులు కల్పించాలని కోరారు. కార్మికుల వేతన సవరణతో పాటు, పెన్షన్ సవరణ కూడా జరగాలని రివ్యూ పిటిషన్, స్పెషల్ లీవ్ పిటిషన్లను ఉపసంహరించి 2016, 2019లలో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలని తెలిపారు. పెన్షనర్ల న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించేవిధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కూకట్పల్లి ఈపీఎఫ్ కార్యాలయంలో పీఆర్వో అసిస్టెంట్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎల్డి ప్రసాద్, కె.శంకర రావు, సత్తయ్య, మోహన్రావుతోపాటు శివ, శివప్రసాద్, హనుమంత రావు, రాములు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.