Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్ రాజ్యాం గాన్ని మార్చాలని వ్యాఖ్యానిం చారని, అందులో ఏం మార్చాలి? ఎందుకు మార్చాలి? అనే స్పష్టత ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎన్.సబిత డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్ఎస్ఎస్ మార్గదర్శకాల మాటున రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్బంగా సీఎం ఒక వైపు బీజేపీపై గంభీరంగా మాట్లాడుతూనే మరో వైపు ఆర్ఎస్ఎస్ లక్ష్యాలను అమలు చేసే విధంగా ప్రస్తుత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం దుర్మార్గమన్నారు ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రజాస్వామ్య దేశం, గొప్ప రాజ్యాంగం మనది అని గతంలో వ్యాఖ్యలు చేసి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 లేకుంటే ఏ పాలకులూ తెలంగాణ ఇవ్వలేక పోయేవాళ్లని నాడు ఘంటాపథంగా చెప్పిన సీఎం నేడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం దారుణమని అన్నారు. సీఎం వైఖరిని అందరూ ఖండించాలని కోరారు. రాజ్యాం గంలోని ఏయే అంశాలు ప్రస్తుతం పనికి రావో తేల్చాలన్నారు పాత రాజ్యాంగం కోసం పరితపించే వారి ఆధ్యాత్మిక దైవం చినజీయర్ స్వామి కులాలు ఇలాగే ఉండాలి, ఏ కులం పని ఆ కులం చేయాలి, అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందేనని, ఆయన ఆదేశాల మేరకే సీఎం మాట్లాడి నట్టు స్పష్టమవుతోందని తెలిపారు. పాత రాజ్యాంగం అంటే మనుస్మృతి అని, ఇది చాతుర్వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ దోపిడీ అణిచివేత నిరంతరంగా కొనసా గాలనే ఉద్దేశపూర్వక వ్యాఖ్యల్లాగే ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజరు కేసీఆర్ తరం కాదని వ్యాఖ్యానించారని, కానీ వారి అసలు ఉద్దేశం రాజ్యాంగాన్ని రద్దుచేయడమేనని వెల్లడించారు. కేసీఆర్ మాటలన్నీ మేకపోతు గాంభీర్యమే కానీ మదపుటేనుగులాగా బీజేపీ రాజ్యాంగాన్ని నలిపివేస్తోందన్నారు. బీజేపీ విధానాలతో రాజ్యాంగానికి మరింత నష్టదాయకమని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలని ఆమె హితవు పలికారు.