Authorization
Fri March 21, 2025 12:41:04 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగర పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న అధికారు లను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్నారు. విధుల్లో ప్రతిభకనబర్చిన వారికి ప్రోత్సహకాలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా హైదారాబాద్ కమిష నరేట్ పరిధిలో గడిచిన ఆరు, ఏడు సంత్సరాలనుంచి సాంకేతికపరంగా చేపడుతున్న కార్యక్రమాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. గురువారం నగర కమిషనరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జోన్ల వారీగా అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన 61 మంది అధికారులకు ప్రోత్సాహక సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. విధుల్లో ప్రతిభ కనబర్చిన వారిని షార్ట్ లిస్ట్ చేశామన్నారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల నుంచి కేసుల పరిష్కారం, శాంతిభద్రత పరిరక్షణలో నిర్లక్ష్యం చేయకుండా విధులు నిర్వహించిన వారిని ప్రోత్సాహిస్తున్నామని తెలిపారు. పోలీస్ శాఖలోకి కొత్తగా వచ్చిన ఎస్ఐలకు మార్గనిర్దేశం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆధునిక పెట్రోలింగ్, ఇతర సాంకేతిక కార్యక్రమాల పరంగా హైదరాబాద్లో చేపడుతున్న మంచి పనిని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ చౌహాన్, జాయింట్ సీపీ గజరావు తదితరులు పాల్గొన్నారు.