Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్- రేడియేషన్ డాక్టర్ కంకటి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న 'ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం'గా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం థీమ్ 'క్లోజ్ ది కేర్ గ్యాప్'. ప్రతి సంవత్సరం సుమారు 10 మిలియన్ల మంది క్యాన్సర్ బారినపడుతున్నారు. ఇది మరణానికి 2వ ప్రధాన కారణంగా ఉంది. 70శాతం క్యాన్సర్ మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవిస్తున్నాయి. 33శాతం క్యాన్సర్లు నివారించదగినవి. క్యాన్సర్‌పై అవగాహన పెంచడమే 'ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం' జరుపుకోవడం ప్రధాన లక్ష్యం అని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్ట్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్-రేడియేషన్ డాక్టర్ కంకటి శ్రీనివాస్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్‌తో సంబంధం ఉన్న ప్రమాద కారకాలు ఆల్కహాల్, పొగాకు, ఆహారం, పోషకాహారం, శారీరక చురుకుదనం లేకపోవుట, ఊబకాయం, జన్యు సిద్ధత మొదలైనవని వివరించారు. క్యాన్సర్ సంరక్షణ అనేది నివారణ, స్క్రీనింగ్, రోగ నిర్ధారణతో ప్రారంభమవుతుందన్నారు. క్యాన్సర్ సంరక్షణలో గ్రామీణ-గ్రామీణేతర అసమానతలు విస్తృతమవుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లోని రోగులు క్యాన్సర్ సంరక్షణ విషయానికి వస్తే అనేక సమస్యలను ఎదుర్కొంటారన్నారు. అవగాహన లేకపోవడంతో క్యాన్సర్ బారినపడుతున్నారని తెలిపారు. క్యాన్సర్ నివారణకు దేశవ్యాప్తంగా బహుళ వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచాలన్నారు. కమ్యూనిటీ నాయకుల మధ్య భాగస్వామ్యాన్ని సృష్టించడం అవసరమన్నారు. అమెరికన్ అంకాలజీ ఇన్స్ట్టిట్యూట్లో క్యాన్సర్‌పై పూర్తి అవగాహన కల్పిస్తారని తెలిపారు. క్యాన్సర్ బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తారన్నారు. అందుకు అవసరమైన నైపుణ్యం, పరికరాలు ఆస్పత్రిలో ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందని తెలిపారు.