Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తరచూ వాహనాల రాకపోకలతో మ్యాన్ హోల్స్ దెబ్బ తిన్నాయి. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని సీపీఐ(ఎం) బాలానగర్ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని వినాయిక్నగర్ ప్రాంతంలోని మెయిన్‌రోడ్డుపై మ్యాన్ హోల్స్వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. డ్రయినేజీ, మ్యాన్‌హోల్స్ కుంగిపోవడంతో రాత్రి వేళల్లో వాహన దారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికైనా స్పందించి సమస్య లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ(ఎం) బాలానగర్ మండల నాయకులు శంకర్, సతీష్, జగన్, గద్ద శ్రీనివాసులు, లింగం తదితరులు పాల్గొన్నారు.