Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇందిరానగర్ ఇండ్ల ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని
నవతెలంగాణ-సిటీబ్యూరో
పేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఖైరతాబాద్ ఇందిరానగర్‌లో ఇండ్ల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు. అర్హులైన వారికి డ్రా ద్వారా ప్లాట్ కేటాయి స్తున్నామని, లబ్దిదారులు ఈ విషయంలో సహకరించాలని అన్నారు. ఖాళీ స్థలంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టాలని ఇందిరా నగర్ కాలనీవాసులకే కాకుండా ఇతర ప్రాంతాల వారికి కూడా ఉపయోగపడే విధంగా ఫంక్షన్ హాల్ నిర్మించాలన్నారు. నగరవాసులు శంషాబాద్, చంపాపేట్ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే ఫంక్షన్లు చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. ఇందిరానగర్ కాలనీ పక్కన హెచ్ఎండీఏకు చెందిన ఎకరం స్థలంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం ఆ స్థలాన్ని జీహెచ్ఎంసీకి అందజేసిన తర్వాత నిర్మాణం చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మేయర్, కమిషనర్‌ను కోరారు. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి మిగతా నియోజకవర్గంలో రూ.3 నుంచి రూ.4 కోట్ల వ్యయంతో చేపడుతుండగా ఇక్కడ నిర్మించే ఫంక్షన్‌హాల్ ఈ కాలనీవాసులకే కాకుండా అందరికీ ఉపయోగపడేవిధంగా నిర్మిస్తామన్నారు. రూ.100కోట్ల విలువైన స్థలాన్ని పేద ప్రజలకంటే గొప్ప విషయం కాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే దానంనాగేందర్ మాట్లాడుతూ.. పీజేఆర్ నగరలో ప్రయివేటు వ్యక్తులకు చెందిన స్థలాన్ని డబుల్ ఇండ్ల నిర్మాణానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయంగా ఏదైనా అందిస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివద్ధి చెందాలనే ముఖ్యమంత్రి ఆశయమన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. నాణ్యతా ప్రమాణాలతో ఇండ్లను నిర్మించి అందుబాటులోకి తెస్తున్న కమిషనర్, హౌసింగ్ అధికారులు, సిబ్బందికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు ఇండ్లకు సంబంధించిన పత్రాలను పంపిణీ చేశారు. 60 ఏండ్లు పైబడిన, కోమర్పిడిటిస్ ఉన్నవారి కోసం ఇంటింటికి వెళ్లి వ్యాక్సినేషన్ వేసేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాన్‌ను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిష నర్ లోకేష్‌కుమార్ హైద రాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, వక్ఫ్ బోర్డు చైర్మెన్ సలీమ్, బేవరేజ్ కార్పొరేషన్ చైెర్మెన్ గజ్జెలనగేష్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ ప్రసన్న, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి, ఓఎస్డీ సురేష్, ఎస్ఈ.జి.కిషన్, ఇఇ.వెంకటదాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.