Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవలంగాణ-నేరెడ్మెట్
కిరాణా షాప్ నుంచి పది నిమిషాలలో వస్తానని వెళ్లిన భర్త గంట అయిన రాకపోవడంతో ఇంటికి వెళ్లి చూసిన భార్యకు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. ఈ సంఘటన నేరెడ్ మెట్ పోలీస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరసింహ స్వామి తెలిపిన సమాచారం మేరకు సూర్య నగర్ కాలనీకి చెందిన మనుబొల్లు రమణయ్య ఇంటికి సమీపంలో కిరాణా షాప్ నడుపుతున్నాడు. ఎప్పటిలాగానే తన భార్య మధ్యాహ్నం షాప్‌కి వెళ్లింది. రమణయ్య పది నిమిషాలలో ఇంటికి వెళ్లి వస్తానని చెప్పాడు. గంట అయినా తిరిగి రాకపోవడం. ఆమె ఇంటికి వెళ్లి తలుపు కొట్టినా తలుపు తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా భర్త సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. 108 అంబులెన్స్‌కు కాల్ చేయగా వారు వచ్చి చూడగా అప్పటికే తన భర్త చనిపోయాడని నిర్థారించారు. 15 రోజుల నుంచి తన భర్త టైఫాయిడ్ జ్వరం, మానసిక బాధతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నారని, అతని మతిపై ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొందని సీఐ తెలిపారు.